మంగళగిరి నుండి పోటీ చేయనున్న నారా లోకేష్Nara Lokesh to Contest from Mangalagiri assembly

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ కు మంగళకరమైన స్థానాన్ని అప్పగించాడు . గుంటూరు జిల్లా మంగళగిరి నుండి లోకేష్ ని పోటీ చేయాల్సిందిగా కోరాడు . అన్ని విధాలుగా ఆలోచించిన మీదటే మంగళగిరి అయితేనే లోకేష్ కు బెటర్ అని భావించాడట ! గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడా తోనే ఓడిపోయాడు దాంతో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ని ఓడించాలంటే లోకేష్ కరెక్ట్ అని నిర్ణయించాడట చంద్రబాబు .

 

లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే . ఎం ఎల్ సి గా వెళ్లిన లోకేష్ ఈసారి ఎన్నికల్లో తలపడాలని నిర్ణయించుకున్నాడు . రాజధాని పరిసర ప్రాంతం మంగళగిరి కావడంతో తప్పకుండా లోకేష్ ని గెలిపిస్తారని భావిస్తున్నాడట చంద్రబాబు . ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనుంది , అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం మేలో రానున్నాయి .

English Title: Nara Lokesh to Contest from Mangalagiri assembly