లోకేష్ పై ఎన్టీఆర్ మామ పోటీ చేయనున్నాడా ?Nara lokesh v/s narne srinivasarao in mangalagiri

నారా లోకేష్ కు మంగళగిరి స్థానం కేటాయించాడు నారా చంద్రబాబు నాయుడు . నారా లోకేష్ కోసం రకరకాల స్థానాలను తీవ్రంగా అలోచించి చివరకు మంగళగిరి ఓకే చేసారు అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడినట్లుంది ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు రూపంలో . జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే .

 

కాగా నార్నే శ్రీనివాసరావు ని మంగళగిరి నుండి పోటీ చేయించాలని నారా లోకేష్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడట జగన్ . నారా లోకేష్ ని కొట్టాలంటే ఎన్టీఆర్ మామే కరెక్ట్ అని భావిస్తున్నాడట జగన్ . ఒకవేళ అదే జరిగితే లోకేష్ కు ఇబ్బందే ! ఎందుకంటే కమ్మ కులం కార్డు తో పాటుగా సమీప బంధువు కాబట్టి నారా లోకేష్ విజయావకాశాలను దెబ్బ కొట్టొచ్చు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు అన్న సంకేతాలను పంపొచ్చు అని ఆలోచన చేస్తున్నాడట జగన్ . ఇక నార్నే శ్రీనివాసరావు కూడా జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి నేను రెడీ అని అంటున్నాడట .

English Title: Nara lokesh v/s narne srinivasarao in mangalagiri