మూగవాడిగా నారా రోహిత్ !!


Nara Rohith to play full length Dumb role in his Nextవిభిన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో నారా రోహిత్ మరో ప్రయోగాత్మక రోల్ చేయబోతున్నారు. శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రంలో నారా రోహిత్ మూగవాని పాత్రలో కనిపించనున్నారు. ఇది నారా రోహిత్ నటించబోయే పద్దెనిమిదవ చిత్రం. ఉగాదికి ప్రారంభం కానున్న ఈ చిత్రానికి పిబి మంజునాథ్ దర్శకత్వం వహిస్తారు.

 

ఈ చిత్రానికి కథ-మాటలు: వంశీ రాజేష్, ప్రొడక్షన్స్ డిజైనర్: రవిందర్, పి.ఆర్.ఓ: వంశిశేఖర్, సంగీతం: వికాస్ కురిమెళ్ళ, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీఎల్ రిచర్డ్ ప్రసాద్, సమర్పణ: డా. సౌజన్య అట్లూరి, బ్యానర్: శ్రీ వైష్ణవీ క్రియేషన్స్, నిర్మాత: నారాయణ రావు, అట్లూరి, దర్శకత్వం: పిబి మంజునాథ్.