మాలో అవినీతి జరిగిందంటున్న నరేష్


Naresh allegations on sivajirajaమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వివాదం రాజుకుంది . శివాజీరాజా అబద్దాలకోరు అంటూ మా ప్రధానకార్యదర్శి నరేష్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . నేను ఎవరి మీదా ప్రత్యేకంగా ఆరోపణలు చేయడం లేదంటూనే శివాజీరాజా అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు . ఈరోజు ఉదయం శివాజీరాజా , హీరో శ్రీకాంత్ లు మీడియా సమావేశం పెట్టి మాలో అవినీతి జరగలేదని , ఒకవేళ అలాంటిది ఏదైనా నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానని , నా ఆస్థి రాసిస్తానంటూ సవాల్ విసరగా దానికి అంతేహాఘాటుగా స్పందిస్తున్నాడు నరేష్ .

చిరంజీవి అమెరికా టూర్ లో 2 కోట్లు వస్తాయని మొదట మాకు చెప్పారు కట్ చేస్తే కోటి రూపాయలు వచ్చాయి అంతేకాకుండా మా సభ్యులు అమెరికాకు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారని మా నిధులు దుర్వినియోగం చేసారని దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాలు వెలికి తీయాలని సవాల్ చేస్తున్నాడు నరేష్ . మహేష్ బాబు తో మా కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ప్లాన్ చేస్తున్నానని దాని ద్వారా 5 కోట్లు అవలీలగా వస్తాయని అంటున్నాడు. మొత్తానికి మరో నాలుగు నెలల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మాలో వివాదాలు చెలరేగడం పదవుల కొట్లాటలా ఉంది .

English Title: Naresh allegations on sivajiraja