నరేష్ అసమర్ధుడు


Naresh unfit for president : Prudhvi

మా అధ్యక్ష పదవి కోసం పాకులాడుతున్న నరేష్ అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేసారు హాస్య నటుడు పృథ్వీ , నటుడు బెనర్జీ , నాగినీడు . నిన్న జరిగిన శివాజీరాజా ప్యానల్ మీడియా సమావేశంలో ఆ ప్యానల్ సభ్యులందరూ నరేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా పృథ్వీ , బెనర్జీ , నాగినీడు , పరుచురి వెంకటేశ్వర్ రావు లు మాత్రం నరేష్ అసమర్ధుడు అలాంటి వ్యక్తి మా అధ్యక పదవికి అనర్హుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు .

 

మా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎప్పుడు కూడా తన పదవికి న్యాయం చేయలేదని , అలాగే మీటింగ్ లకు కూడా సరిగా రాలేదని అలాంటి వ్యక్తి అధ్యక్షుడు అవుతానంటూ లేని పోనీ ఆరోపణలు చేస్తున్నాడని పెద్దలంటే గౌరవం లేని వ్యక్తి నరేష్ అంటూ ఆవేశం వెళ్లగక్కారు . రెండేళ్ల పదవి కాలంలో నరేష్ పెద్దగా పనిచేయలేదట అంతేకాదు నా బాధ్యతలు నాకు ఇవ్వండి మహా ప్రభో అని వేడుకున్నాడట కూడా . నరేష్ సంగతి పక్కన పెడితే శివాజీరాజా మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నాడు నటీనటుల కోసం .

English Title: Naresh unfit for president : Prudhvi