మా అధ్యక్షుడు గా నరేష్


Naresh win MAA Elections 2019

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్ నటుడు నరేష్ గెలుపొందాడు. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో శివాజీరాజా పై అధ్యక్షుడు గా నరేష్ గెలుపొందగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ రాజశేఖర్ విజయం సాధించాడు. ఇక ప్రధాన కార్యదర్శి గా జీవిత రాజశేఖర్ ఎన్నిక కావడం విశేషం. ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ తో పాటు జీవిత కూడా గెలుపొందడంతో నరేష్ ప్యానల్ చాలా సంతోషంగా ఉంది.

 

శివాజీరాజా అధ్యక్షుడు గా గెలవడం ఖాయమని అనుకున్నారు కానీ అనూహ్యంగా నరేష్ విజయం సాధించాడు అలాగే శ్రీకాంత్ కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించడం ఖాయమని అనుకున్నారు. అయితే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ గెలిచాడు. శివాజీరాజా ప్యానల్ లో ఎక్కువ మంది ఓడిపోవడంతో  తీవ్ర నిరాశలో ఉన్నారు ఆ ప్యానల్ సభ్యులు. మొత్తానికి ఈ ఎన్నికలు కొంతమంది కి నిద్రలేకుండా చేసాయి. ఇప్పటి కైనా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వల్ల నష్టపోయిన ఎన్నారై మురళి కి న్యాయం జరుగుతుందా చూడాలి.

English Title : Naresh win MAA Elections 2019 Movie Artist Association name cheated by MAA