బికినీలో అందాలు ఆర‌బోస్తూ మ‌డ్ బాత్‌!


బికినీలో అందాలు ఆర‌బోస్తూ మ‌డ్ బాత్‌!
బికినీలో అందాలు ఆర‌బోస్తూ మ‌డ్ బాత్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీని బారి నుంచి త‌ప్పించుకోవాల‌న్నా.. త‌ట్టుకోవాల‌న్నా యోగా ఒక్క‌టే మార్గం. దీంతో సెల‌బ్రిటీలంతా ఆరోగ్య సూత్రాల‌ని పాటిస్తూ యోగాస‌నాలు చేస్తున్నారు. కొంత మందేమో ప్ర‌కృతి వైద్యాన్ని, సంప్ర‌దాయ ప‌ద్ద‌తులు ఆచ‌రిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ డిటాక్సింగ్ కోసం మ‌డ్ బాత్ చేస్తోంది. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే అందాల‌కు మెరుగులు అద్దుకుంటోంది. కాలిఫోర్నియాలో మ‌డ్ బాత్ చేసిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా  ఇన్ స్టాలో పంచుకుంది న‌ర్గీస్.

గులాబీ రంగు బికినీ ధ‌రించిన న‌ర్గీస్ ఫ‌క్రీ ఒంటి నిండా ఎర్ర‌మ‌ట్టి రాసుకుని ఎండ‌లో నిల‌బ‌డింది. ఎర్ర‌టి ఎండ‌లో న‌ర్గీస్ అందాలు మెరిసిపోతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఎర్ర‌మ‌ట్టి తో మెరిసిపోతున్న మేని ఛాయ‌తో న‌ర్గీస్ హోయ‌లు పోయింది. మ‌ట్టి ఆర‌డం కోసం వివిధ భంగిమ‌ల్లో న‌ర్గీస్ ఫొటోల‌కు పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

`జీవితంలో ఒక్కోసారి మ‌న శ‌రీరంలోని మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపే ప్ర‌య‌త్నం చేస్తుండాలి. అప్పుడే కొత్త అందంతో మెరుస్తాం. ఎర్ర‌మ‌ట్టి స్నానం శ‌రీరంలోని మ‌లినాల‌ను తొల‌గించ‌డ‌మే కాదు.. కొత్త స్వాంత‌న‌ను ఇస్తుంది. మ‌ట్టి పూసుకుని ఎండ‌లో నిల్చోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డీ పుష్క‌లంగా ల‌భిస్తుంది` అంటూ న‌ర్గీస్ ఫ‌క్రీ సోష‌ల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.