నర్తనశాల రివ్యూ


Nartanasala Movie Review

నర్తనశాల రివ్యూ :
నటీనటులు : నాగశౌర్య , కాశ్మీరా పరదేశి , యామిని భాస్కర్
సంగీతం : సాగర్ మహతి
నిర్మాత : ఉషా ముల్పూరి
దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి
రేటింగ్ : 2/5
రిలీజ్ డేట్ : 30 ఆగస్టు 2018

ఛలో వంటి సూపర్ హిట్ తర్వాత తిరిగి స్వంత బ్యానర్ లోనే నాగశౌర్య చేసిన సినిమా @ నర్తనశాల . శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఉషా ముల్పూరి నిర్మించారు . ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

కళామందిర్ కళ్యాణ్ ( శివాజీరాజా ) తనకు కూతురు పుట్టాలని అనుకుంటాడు కానీ అనూహ్యంగా అబ్బాయి (నాగశౌర్య ) పుడతాడు . అయితే తండ్రి కోసం తన కొడుకు ని కూతురులా పెంచుతాడు . పెరిగి పెద్దవాడైన నాగశౌర్య మహిళలల రక్షణ కోసం ఓ క్లబ్ నిర్వహిస్తుంటాడు అదే సమయంలో మానస (కాశ్మీర ) ని కాపాడతాడు అలా ఆమెతో ప్రేమలో పడతాడు . అయితే అనుకోని అవాంతరంలా సత్య ( యామిని భాస్కర్ ) ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది . మానస ని ప్రేమించిన నాగశౌర్య సత్య ని పెళ్లి చేసుకున్నాడా ? లేక మానస ని పెళ్లి చేసుకున్నాడా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నిర్మాణ విలువలు
కాస్త కామెడీ

డ్రా బ్యాక్స్ :

కథ
కథనం
డైరెక్షన్
సంగీతం

నటీనటుల ప్రతిభ :

నాగశౌర్య గే పాత్రలో నటించడానికి ఒప్పుకొని సాహసమే చేసాడు . ఫస్టాఫ్ లో లవర్ గా సెకండాఫ్ లో గే గా బాగానే నటించాడు కానీ అతడి పూర్తి ప్రతిభ వాడుకునే ప్రయత్నం దర్శకుడు చేయలేదు . దాంతో నాగశౌర్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు అంతే ! హీరోయిన్ లు కాశ్మీర పరదేశి , యామిని భాస్కర్ లకు పెద్దగా నటించడానికి అవకాశం లేకుండా పోయింది అయితే తమ గ్లామర్ తో అలరించారు . అజయ్ కి మంచి పాత్ర లభించింది . శివాజీరాజా పాత్ర కొన్ని చోట్లా నవ్వించినప్పటికీ మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది .

సాంకేతిక వర్గం :

ఐరా క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి , అయితే ఛలో చిత్రానికి వినసొంపైన సంగీతాన్ని అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి అంతగా ఆకట్టుకునేలా పాటలు ఇవ్వలేకపోయాడు . ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . ఇక దర్శకులు శ్రీనివాస చక్రవర్తి విషయానికి వస్తే …… వినోదానికి ఎక్కువగా స్కోప్ ఉన్న లైన్ ని ఎంచుకున్నాడు కానీ దాన్ని సరైన రీతిలో తెరకెక్కించడంలో పూర్తిగా విఫలమయ్యాడు . స్లో నెరేషన్ తో ప్రేక్షకులు నీరసపడేలా చేసాడు .

ఓవరాల్ గా :

ఛలో వంటి సూపర్ హిట్ తీసిన సంస్థ నుండి వస్తున్న చిత్రం కావడంతో @ నర్తనశాల చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి , అయితే ఆ అంచనాలను అందుకోవడంలో @ నర్తనశాల విఫలమయ్యింది .

English Title: Nartanasala Movie Review

Click here for English Review