నటుడు నాజర్ పై సంచలన ఆరోపణలు


నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పెద్ద పెద్ద నీతులు చెబుతున్న నటుడు నాజర్ కన్న తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని నాజర్ సోదరులు సంచలన ఆరోపణలు చేసారు . మా ఇంట్లో పెద్దవాడు నాజర్ అయితే అతను పెళ్లి చేసుకున్నాక ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు నటుడిగా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు కానీ కనిపెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు , ఆర్ధిక సహాయం కూడా అందించడం లేదు , కనీసం వృధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడాల్సిన కనీస బాధ్యత కూడా నాజర్ కు లేదా ? అంటూ నిప్పులు చెరిగారు నాజర్ సోదరులు ఆయుబ్ , జవహర్ లు .

మేము నలుగురం అన్నాదమ్ములం అయితే చిన్నవాడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు దాంతో ఇంటి బాద్యతలను మేమిద్దరమే చూసుకుంటున్నాం , ఇప్పటికైనా నాజర్ మా కుటుంబాన్ని పట్టించుకోకపోతే కోర్టు ని ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నాజర్ సోదరులు . మరి ఈ సంచలన ఆరోపణలపై నాజర్ ఎలా స్పందిస్తాడో చూడాలి .