కపిల్ దేవ్ ని దించేసిన రణవీర్ సింగ్


కపిల్ దేవ్ ని దించేసిన రణవీర్ సింగ్
కపిల్ దేవ్ ని దించేసిన రణవీర్ సింగ్

ఇప్పుడంటే ప్రస్తుతం జనరేషన్ పిల్లలందరూ ఎంఎస్ ధోని మాదిరిగా హెలికాఫ్టర్ షాట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు క్రికెట్ చూడటానికి కూడా అవకాశం లేకుండా రేడియోలో కామెంట్రీ విని మ్యాచ్ ను ఎంజాయ్ చేసే రోజులలో కూడా అప్పటి మన క్రికెటర్లు మైదానంలో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసే వాళ్ళు. బహుశా, వాళ్లు కావాలని ప్రయత్నించక పోయినా.. వాళ్లు ఆడే ప్రయత్నంలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా కనిపించేది. దానికి ఈరోజుల్లో చెప్పుకునే ఒక ఉదాహరణ ధోని హెలికాఫ్టర్ షాట్.

మరి ఆ రోజుల్లో కూడా ఇండియా టీం కి ఒక మంచి కెప్టెన్ ఉండేవాడు. బ్యాటింగ్ చేస్తాడు; బౌలింగ్ చేస్తాడు; ఒక్కమాటలో చెప్పాలంటే ఆల్ రౌండర్. 1983 లో జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా టీం తరుపున ప్రాతినిధ్యం వహించి, ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి, భారతదేశానికి ప్రపంచ క్రికెట్ కప్ అందించిన గొప్ప ఆటగాడు కపిల్ దేవ్. కపిల్ దేవ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక అద్భుతమైన పోజ్ వుండేది అది అతను లెగ్ సైడ్ తిరిగి సిక్స్ కొట్టేటప్పుడు కనపడే నటరాజ్ షాట్. ఆ భంగిమలో కపిల్ దేవ్ అచ్చం నటరాజ స్వామిని పోలి ఉండేటట్లు కనిపించేవాడు.

కపిల్ దేవ్ రణవీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఎప్పుడూ ఇండియా – పాకిస్తాన్ యుద్ధాలు నేపథ్యంలో సినిమాలు తీసే దర్శకుడు కబీర్ ఖాన్, ఈసారి తన పంథాకి విభిన్నంగా కపిల్ దేవ్ బయోపిక్ ను “83” అనే పేరుతో తీస్తున్నాడు. కపిల్ దేవ్ భార్య రోమీ పాత్రలో రణవీర్ సింగ్ జీవిత భాగస్వామి దీపికా పదుకునే నటిస్తోంది

ఇప్పటికే సినిమాలో కపిల్ లా కనిపించడానికి, కపిల్ దేవ్ పాత్రలో నటించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాడు. రణవీర్ సింగ్ కపిల్ ప్రవర్తన, హావభావాలు, మాటతీరు, నడక చివరికి ఆహారపు అలవాట్లతో సహా అన్ని గమనించి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ లో కపిల్ దేవ్ బ్యాటింగ్ చేసేటప్పుడు, ఆయన ట్రేడ్ మార్క్ అయిన షాటైన నటరాజు షాట్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూసిన సినిమా ప్రేక్షకులు, అభిమానులు, రణవీర్ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. కపిల్ దేవ్ ను రణవీర్ సింగ్ దించి పడేశారని ఆనందపడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.

Credit: Instagram