నాట్స్ బోర్డు కొత్త బోర్డు సభ్యులు


NATS Announced New Board Members

అమెరికాలో తెలుగుజాతి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. కొత్త కార్యవర్గం టెంపాలో సమావేశమైంది. నాట్స్ బోర్డుకు కొత్తగా ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ గుత్తికొండ ఆధ్వర్యంలో నాట్స్ ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించింది. కొత్తగా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లుగా బాధ్యతలు తీసుకున్న వారితో పాటు  పాత డైరక్టర్లు ఈ కార్యవర్గ సమావేశానికి విచ్చేశారు. నాట్స్ లక్ష్యాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముందుగా నాట్స్ కొత్త డైరక్టర్లను నాట్స్ బోర్డు అభినందించింది..

 

నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ శ్యామ్ మద్ధాళి మాట్లాడుతూ నాట్స్ లో ఎవరూ బాధ్యతలు తీసుకున్నా వారు అంకితభావంతో పనిచేయడంతో పాటు తమ కింద నాయకత్వంలో కూడా స్ఫూర్తిని నింపుతున్నారని అన్నారు.. తాను ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ప్రస్తుత నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్  శ్రీథర్ అప్పసాని అందించిన సహయ సహకారాలు నా జీవితంలో మరిచిపోలేనివని అన్నారు.. నాట్స్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలో తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. నాట్స్ ప్రగతిపథంలో పయనించేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవ పిలుపునిచ్చారు. నాట్స్ బోర్డు డైరక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన వారంతా సమావేశంలో తమను తాము పరిచయం చేసుకున్నారు. నాట్స్ వచ్చే రెండేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలపై బోర్డు లో సవివరంగా చర్చించారు.

NATS Announced New Board Members