ఇంకా ఏమేమి చూడాల్సి వ‌స్తుందో!ఇంకా ఏమేమి చూడాల్సి వ‌స్తుందో!
ఇంకా ఏమేమి చూడాల్సి వ‌స్తుందో!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో రానా ఒక‌రు. గ‌త కొంత కాలంగా రానాకు సంబంధించిన పెళ్లి వార్త‌లు షికారు చేస్తున్నా స‌మాధానం దాట‌వేస్తూ వ‌చ్చిన రానా తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా త‌న‌కు కాబోయే వైఫ్ ని నేరుగా ప‌రిచ‌యం చేసి షాకిచ్చారు. హైద‌రాబాదీ అమ్మాయి మిహికా బ‌జాజ్‌ని తాను వివాహం చేసుకోబోతున్న‌ట్టు వెల్ల‌డించ‌డంతతో ఇండ‌స్ట్రీల‌కు అతీతంగా స్టార్ హీరోయిన్‌లు, హీరోలు రానాకు శుభాకాక్ష‌లు చెబుతున్నారు.

ప‌నిలో ప‌నిగా హీరో నేచుర‌ల్ స్టార్ నాని కూడా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిగా వెరైటీగా వెల్ల‌డించ‌డం ఆక‌ట్టుకుంటోంది. `ఈ 2020లో ఇంకా ఏమేమి చూడాల్సి వ‌స్తుందో ` అంటూ స్పందించిన నాని ఈ సంద‌ర్భంగా ఈ పాట‌ను డెడికేట్ చేస్తున్నా అంటూ బ‌జాజ్ స్కూట‌ర్‌కి సంబంధించిన ఓ పాత యాడ్‌ని షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

నాని ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`లో న‌టిస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తుంటే నాని తొలిసారి ఈ చిత్రంలో విల‌న్‌గా నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.  క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర రిలీజ్ వాయిదా ప‌డింది. లాక్‌డౌన్ త‌రువాత ప‌రిస్థితుల‌ని బ‌ట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు  ప్లాన్ చేస్తున్నారు.