సింగ‌ర్‌గా మారిన నేచురల్ స్టార్ వైఫ్!


సింగ‌ర్‌గా మారిన నేచురల్ స్టార్ వైఫ్!
సింగ‌ర్‌గా మారిన నేచురల్ స్టార్ వైఫ్!

నేచుర‌ల్ స్టార్ నాని వెండి తెర‌పై ఎంత నేచుర‌ల్‌గా వుంటారోఅంద‌రికీ తెలిసిందే. ఆయ‌న భార్య అంజ‌నా య‌ల‌వ‌ర్తి కూడా అంతే నేచుర‌ల్‌గా వుంటారు. ప‌బ్లిక్ ఈవెంట్‌ల‌కి వెళ్లినా పెద్ద‌గా స్టార్ వైఫ్‌లా హ‌డివు‌డీ చేయ‌రు. చాలా సింపుల్‌గా క‌నిపిస్తుంటారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా నానికి సంబంధించిన ఫొటోల‌ని మాత్ర‌మే షేర్ చేస్తూ అభిమానుల‌కు నిత్యం ట‌చ్‌లో వుండే అంజ‌న తాజాగా సింగ‌ర్‌గా మారిపోవ‌డం ఆకట్టుకుంటోంది.

సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో అంజ‌న ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అంజ‌న‌ త‌న స్నేహితురాలితో క‌లిసి ఓ పాట‌‌ని ఆల‌పించారు. ఈ పాట నెట్టింట వైర‌ల్‌గా మారింది.  ప్ర‌భుదేవా హీరోగా శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం `ప్రేమికుడు`. ఈ  చిత్రంలోని `అంద‌మైన ప్రేమ‌రాణి చేయి త‌గిలితే.. అంటూ సాగే పాట ఎంత పాపుల‌ర్ అయ్యిందో అంద‌రికి తెలిసిందే.

ఏ. ఆర్. రెహ‌మాన్ సంగీతంలో ఉదిత్ నారాయ‌ణ్ ఈ పాట‌ని ఆల‌పించారు. ఈ పాట‌ని హీరో నాని వైఫ్ అంజ‌నా త‌న స్నేహితురాలితో ఆల‌పించడం ఆక‌ట్టుకుంటోంది.