నేచుర‌ల్‌స్టార్ కొత్త లుక్ ఇదేనా?


Naturual Star Nani New Look
Naturual Star Nani New Look

కాలంతో పాటు ప్రేక్ష‌కుడి అభిరుచి కూడా మారుతోంది. దానికి త‌గ్గ‌ట్టే హీరోలు, ద‌ర్శ‌కుల పంథా మారుతోంది. స‌గ‌టు ప్రేక్ష‌కుడికి న‌చ్చితేగానీ ఈ రోజుల్లో థియేట‌ర్‌కు రావ‌డం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హీరోలు, ద‌ర్శ‌కులు ఎప్పటిక‌ప్పుడు కొత్త కొత్త ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నేచేర‌ల్‌స్టార్ నాని కూడా ఆ సూత్రానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నాడు. కొత్త త‌ర‌హా చిత్రాల‌తో స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ మంచి ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్న నాని ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

దిల్ రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ రూపొందిస్తున్న `వి` చిత్రంలో న‌టిస్తున్నాడు. సుధీర్‌బాబు ఇందులో మ‌రో హీరో. నాని నెగెటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. మార్చి 25న ఉగాది కానుక‌గా రానున్న ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రానికి ఫ్రీమేక్ అని తెలిసింది. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు `నిన్ను కోరి`, మ‌జిలి చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. `ట‌క్ జ‌గ‌దీష్‌` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో నాని కొత్త త‌ర‌హా క‌నిపించ‌బోతున్నాడు. ఇందు కోసం పెప్ప‌ర్ అండ్ సాల్ట్ లుక్‌ని ట్రై చేస్తున్నాడ‌ని తెలిసింది.

తాజాగా ఈ లుక్‌కు సంబంధించిన ఫొటోని నాని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఫొటోలో నాని మునుపెన్న‌డూ క‌నిపించ‌ని రీతిలో బారు గ‌డ్డం, హెవీ హెయిర్‌తో పెప్ప‌ర్ అండ్ సాల్ట్ లుక్‌తో క‌నిపిస్తుండ‌టం సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.  ఇటీవ‌ల రివేంజ్ డ్రామా `గ్యాంగ్ లీడ‌ర్‌`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రంపై చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. టైటిల్ గ‌మ్మ‌త్తుగా, ఇంట్రెస్టింగ్‌గా వుండ‌టంతో ఈ సినిమా ఎలా వుండ‌బోతోందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.