ట్రాఫిక్ సిగ్నల్ పై సెటైర్ వేసిన హీరో


navadeep satire on hyderabad traffic signalsహైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దారుణంగా ఉన్నాయి దాంతో ఆ ట్రాఫిక్ సిగ్నల్ పై సెటైర్ వేసాడు హీరో నవదీప్ . ఈ నటుడు వెళుతున్న సమయంలో ఓ చౌరస్తా లో విచిత్రకరమైన సిగ్నల్ రావడంతో దాన్ని ఫోటో తీసి మన హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలా విచిత్రంగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు , ఇప్పుడా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది . సిగ్నల్ లో పైన రెడ్ మార్క్ చూపిస్తుండగా దాని కింద లెఫ్ట్ సైడ్ వెళ్ళమన్నట్లు గ్రీన్ సిగ్నల్ అలాగే స్ట్రైట్ గా గ్రీన్ సిగ్నల్ కూడా ఉంది . అంటే పైన రెడ్ వెలుగుతూనే ఉండగా కింద గ్రీన్ ఎలా వస్తుంది అన్నది నవదీప్ ప్రశ్న !

రెడ్ , గ్రీన్ రెండు కూడా ఒకేసారి కనిపిస్తుండటం తో నెటిజన్లు కూడా నవదీప్ కి మద్దతు ప్రకటిస్తూ భాగ్యనగరం ట్రాఫిక్ సిగ్నల్స్ పై సెటైర్లు వేస్తున్నారు . హైదరాబాద్ అంటేనే విచిత్రం ! ఒకవైపు రోడ్లను తవ్వొద్దు ఆరునెలల పాటు నిషేధం …. ఎవరైనా రోడ్లని తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని జిఓ లు జారీ చేస్తుంటారు , ఆ జిఓ లు రావడమే ఆలస్యం మరోవైపు రోడ్లని తవ్వుతునే ఉంటారు .

ఇక నవదీప్ విషయానికి వస్తే ….. ….. హీరోగా కెరీర్ అంతగా బాగోలేకపోవడంతో సైడ్ క్యారెక్టర్ లు పోషిస్తున్నాడు అలాగే యాంకర్ గా కూడా రాణిస్తున్నాడు . అలాగే అడపాదడపా వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటున్నాడు నవదీప్ .

English Title: navadeep satire on hyderabad traffic signals

navadeep satire on hyderabad traffic signals