భారీ రేటు డిమాండ్ చేస్తోన్న నవీన్ పోలిశెట్టి

భారీ రేటు డిమాండ్ చేస్తోన్న నవీన్ పోలిశెట్టి
భారీ రేటు డిమాండ్ చేస్తోన్న నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి చేసే సినిమాల విషయంలో చాలా పక్కాగా ఉంటాడు. ఇప్పటిదాకా తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు చిత్రాలు చేసాడు. ఈ రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ కాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు జాతిరత్నాలు సీక్వెల్ పై ఫోకస్ పెట్టాడు.

అనుదీప్ రీసెంట్ గా నవీన్ కు ఈ సినిమా స్క్రిప్ట్ నరేట్ చేసాడట. నవీన్ సూపర్ ఇంప్రెస్ అయి వెంటనే పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు సీక్వెల్ అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందిట. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఈ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే నవీన్ ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. జాతిరత్నాలు సీక్వెల్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.