ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న నవీన్ పోలిశెట్టి..!!


Naveen Polishetty
Naveen Polishetty

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ“తో మంచి హిట్ సాధించి అందరి ద్రుష్టిని ఆకర్షించిన నటుడు నవీన్ పోలిశెట్టి. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసిన నవీన్ కి యూట్యూబ్ స్టార్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తొలిసారి అతను హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచించింది.

ఇక నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి ఎలాంటి చిత్రం చేస్తాడా?అన్న ఆసక్తి అందరిలో నెలకొనివుంది.. అందరి అంచనాలకు తగ్గట్లుగానే నవీన్ పోలిశెట్టి వైజయంతి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్లో సినిమా చేస్తున్నాడు.. ‘పిట్టగోడ’ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రియదర్శి, రాహుల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సగభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుండి తాజా షెడ్యూల్ జరపనుంది. అక్టోబర్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి “జాతిరత్నాలు” అన్న టైటిల్ పరిశీలనలో వుంది.. ఇదే పేరుని కన్ఫర్మ్ చేస్తారనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.. !