క్షీణించిన మాజీ హీరోయిన్ ఆరోగ్యం!Navneet kaur health condition is critical
Navneet kaur health condition is critical

తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న న‌వ‌నీత్ కౌర్ ప్ర‌స్తుతం ఎంపీగా పని చేస్తోంది. 2010 నుంచే సినిమాల‌కు దూర‌మైన న‌వ‌నీత్ కౌర్ క్రియాశీల రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి ఎంపీ అయిన న‌వ‌నీత్ కౌర్ తో పాటు ఆమె కుటుంబానికి చెందిన 12 మంది ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ్డారు. ముంబైలోని అమ‌రావ‌తి ఆసుప‌త్రిలో చేరి గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం క్షీణించింద‌ని తెలిసింది. హాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించ‌డంతో నాగ్‌పూర్‌లోని ఓ ఆసుప‌త్రికి న‌వ‌నీత్ కౌర్‌ని త‌ర‌లించిన‌ట్టు తెలిసింది.

న‌వ‌నీత్ కౌర్ భ‌ర్త ర‌వికి ఇటీవ‌ల క‌రోనా వైరస్ సోకింది. దీంతో కుటుంబంలోని అంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోగా 12 మంఇకి క‌రోనా సోకిన‌ట్టు తేలింది. ఇందులో న‌వ‌నీత్ కౌర్ అత్తా, మామ‌లు, పిల్ల‌లు కూడా వున్నారు. త‌మ‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా న‌వ‌నీత్ కౌర్ స్ప‌ష్టం చేసింది. త‌మ‌ని క‌లిసిన వారంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు కూడా.

2019 ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ నుంచి న‌వ‌నీత్ కౌర్ ఎంపీ టిక్కెట్‌ని ఆశించారు. అయితే బీజేపీ అధిష్టానం ఆమెని చిన్న చూపు చూసింది. ప‌ట్టుద‌ల‌తో ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచిన న‌వ‌నీత్ కౌర్ ప‌ట్టు సాధించింది ఎంపీగా గెలుపొంది బీజేపీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది.