నక్షలైట్ పాత్రలో చిరంజీవి !


Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటించనున్నాడట ! తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి చిరు రెడీ అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని ఈనెల 22 న అంటే చిరంజీవి పుట్టినరోజున ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం పోషిస్తుండగా ఒక పాత్ర మాత్రం నక్సలైట్ .

నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు . నక్సలైట్ ల సమస్య అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో తక్కువగా ఉంది కానీ 80 వ దశకంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఉండేవి . నిత్యం మందుపాతరాలతో , బాంబు ల మోతలతో తుపాకుల మోతలతో దద్దరిల్లిపోయేవి తెలుగు రాష్ట్రాలు అందునా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో . ఇదే నేపథ్యాన్ని ఎంచుకొని సందేశాత్మకంగా చేస్తున్నాడట కొరటాల శివ .