ఓనం పండ‌క్కి ప్రియుడితో ఇంటికి!


ఓనం పండ‌క్కి ప్రియుడితో ఇంటికి!
ఓనం పండ‌క్కి ప్రియుడితో ఇంటికి!

కోలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్ క‌పుల్‌గా నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న ప్రేమ జంట న‌మ‌న‌తార, విఘ్న‌ష్ శివ‌న్‌. గ‌త కొంత ఆక‌లంగా వీరిద్ద‌రు డేటింగ్‌లో వుంటున్న విష‌యం తెలిసిందే. పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్న ఈ జంట డేటింగ్ బోర్ కొట్టిన‌ప్పుడు మాత్ర‌మే వివాహం గురించి ఆలోచిస్తార‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

పెళ్లి గురించి క్లారిలీ ఇవ్వ‌డంతో ఈ జంట‌పై పెళ్లి పుకార్లు స‌ద్దు మ‌నిగాయి. అయినాఈ జంట ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ ఓ న్యూస్ పుట్టుకొస్తోంది. తాజాగా ఈ జంట ప్ర‌త్యేక చార్టెడ్ ప్లైట్‌లో కొచ్చీ వినాశ్ర‌య‌మంలో ప్ర‌త్య‌క్ష‌మైంది. చెన్నై నుంచి ప్ర‌త్యేకంగా కొచ్చీకి ఈ జంట రావ‌డంతో కొచ్చీ ఫొటోగ్రాఫ‌ర్ల‌కు పండ‌గ‌లా మారిపోయింది. ఎగ‌బ‌డి మ‌రీ ఫొటోలు తీసుకున్నారు. ఇంత‌కీ న‌య‌న్‌, విఘ్నేష్ వున్న‌ట్టుంది కొచ్చీ ఎందుకొచ్చారు. అదీ ప్ర‌త్యే చార్టెడ్ ప్లైట్‌లో అని అంతా ఆరాతీయ‌డం మొద‌లుపెట్టారు.

ఈ జంట కిచ్చీలో ల్యాండ్ అయ్యింది ఓన‌మ్ ఫెస్టివ‌ల్ కోస‌మ‌ని తెలిసింది. పెళ్లికి ముందే కొత్త అల్లుడికి అత్తారింట్లో విడిది ఏర్పాట్లు చేయ‌డం భ‌లేగా వుందే అంటున్నారు ఇది తెలిసిన సినీ జ‌నం. బ్లూ సూట్‌లో బ్లాక్ గాగుల్స్ ధ‌రించి కిల్లింగ్ లేడీగా న‌య‌న్ అర‌ద‌గొట్టేసింది. విఘ్నేష్ కూడా ఏ మాత్రం త‌గ్గ లేదు. రెడ్ అండ్ బ్లూ డ్రెస్‌లో హీరోలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఓనం రోజు ఈ జంట సోష‌ల్ మీడియాలో ఎంత ర‌చ్చ చేస్తుందో చూడాలి.