షాకింగ్ పాత్ర‌లో లేడీ సూప‌ర్‌స్టార్‌!Nayanatar to paly keerthi suresh's mother in annathe
Nayanatar to paly keerthi suresh’s mother in annathe

తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌య‌న‌తార లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె న‌టిస్తే చాలు అందులో హీరో కూడా అవ‌స‌రం లేద‌నే స్థాయిలో త‌మిళంలో గ‌త కొంత కాలంగా సినిమాలు రూపొందుతున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు కురిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా స్టార్ డ‌మ్‌ని ఎంజాయ్ చేస్తున్న న‌య‌న‌తార ఈ ఏడాది సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ఏడాదే ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ని వివాహం చేసుకోబోతున్న న‌య‌న‌తార న‌టిగా కూడా ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. యంగ్ హీరో నితిన్‌తో క‌లిసి `అంధాదూన్‌` తెలుగు రీమేక్‌లో న‌టించ‌నున్న న‌య‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం `అన్నాత్తే`. సిరుతై శివ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మీనా, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కూడా న‌టిస్తోంది.

అయితే ఆమెకు త‌ల్లిగా ఈ చిత్రంలో నయ‌న తార క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నార‌ట‌. క్రేజ్ వున్న స‌మ‌యంలో త‌ల్లి పాత్ర‌కు న‌య‌న అంగీక‌రించ‌డం ఏంట‌ని వాపోతున్నార‌ట‌. ఇదిలా వుంటే స‌న్ పిక్చ‌ర్స్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందు సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకున్నారు. క‌రోనా కార‌ణంగా అది స‌మ్మ‌ర్‌కు మారిన‌ట్టు తెలుస్తోంది.