`లూసీఫ‌ర్‌` రీమేక్‌లో స్టార్ హీరోయిన్‌?


`లూసీఫ‌ర్‌` రీమేక్‌లో స్టార్ హీరోయిన్‌?
`లూసీఫ‌ర్‌` రీమేక్‌లో స్టార్ హీరోయిన్‌?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన కీల‌క షెడ్యూల్ ఇటీవ‌లే ప్రారంభ‌మైన‌ట్టు తెలిసింది.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఇందులోని ఓ కీల‌క పాత్ర‌లో హీరో స‌త్య‌దేవ్ న‌టిస్తున్నారు. హీరోయిన్‌గా మంజు వారియ‌ర్ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించిన చిత్ర బృందం తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.

ఆ స్టార్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు న‌య‌న‌తార‌. ఇటీవ‌లే చిత్ర బృందం ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని, చిరుకు జోడీగా న‌టించ‌డానికి న‌య‌న‌తార గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ వారంతంలో ఈ రీమేక్ ని లాంఛ‌నంగా ప్రారంభింంచాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.