చిరంజీవిని లెక్కచేయని నయనతార


Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే . ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చిరంజీవి అలాగే చరణ్ లు చేపట్టారు. అయితే నయనతార మాత్రం సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనడం లేదు .

సహజంగానే నయనతార ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కానీ ఇది ప్రతిష్టాత్మక చిత్రం అందునా చిరంజీవి నటించిన చిత్రం అయినప్పటికీ ఐ డోంట్ కేర్ అంటోంది నయన్ . దాంతో చరణ్ కు ఎక్కడా లేని కోపం వస్తోందట . ఒక గొప్ప చిత్రాన్ని తీశామని సంతృప్తి చెందుతుంటే ఆ సంతోషాన్ని మాయం చేసేలా నయనతార హ్యాండ్ ఇస్తుండటంతో ఆగ్రహంగా ఉన్నారట . సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయనున్నారు . ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం తమన్నా తో పాటుగా ఇతర నటీనటులు వస్తున్నారు కానీ నయన్ మాత్రం సినిమా చూపిస్తోందట.