ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయనతార


Nayantara and Vignesh Shivan
Nayantara and Vignesh Shivan

దక్షిణాదిన అగ్రశ్రేణి కథానాయికగా చలామణి అవుతున్న భామ నయనతార తాజాగా గ్రీస్ దేశంలో తన ప్రియుడు దర్శకులు విగ్నేష్ శివన్ తో ఎంజాయ్ చేస్తోంది . గ్రీస్ దేశానికి వెళ్లామని అక్కడ రకరకాల ప్రదేశాలను చుట్టేస్తున్నామంటూ ప్రయాణం తాలూకు ఫ్లయిట్ టికెట్స్ ని ఫోటో తీసి వాటికి జతగా తన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది నయనతార .

శింబు , ప్రభుదేవాల తర్వాత విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తోంది నయనతార . అయితే ఈ ఇద్దరూ ప్రేమికులు మాత్రమే కాదు భార్యాభర్తలు కూడా అని అంటుంటారు . రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది . అయితే ఆ విషయం పక్కన పెడితే చాలాకాలంగా మాత్రం ఈ ఇద్దరూ కలిసే ఉంటున్నారు . తాజాగా గ్రీస్ దేశానికి వెళ్లారు అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు .