ర‌జ‌నీ సినిమాలో న‌య‌న‌తార పాత్ర ఇదే!


ర‌జ‌నీ సినిమాలో న‌య‌న‌తార పాత్ర ఇదే!
ర‌జ‌నీ సినిమాలో న‌య‌న‌తార పాత్ర ఇదే!

ర‌జ‌నీకాంత్‌తో న‌య‌న‌తార ముచ్చ‌ట‌గా మూవ‌డ‌వ‌సారి క‌లిసి న‌టించ‌బోతోంది. 2005లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ `చంద్ర‌ముఖి` చిత్రంలో తొలిసారి న‌య‌న‌తార‌, ర‌జ‌నీ క‌లిసి న‌టించారు. ఆ త‌రువాత మ‌ళ్లీ దాదాపు 14 ఏళ్ల‌కు `ద‌ర్బార్‌`లో న‌టించారు. ఈ సినిమాలో న‌య‌న పాత్ర కొత్త‌గా వుంటుంద‌ని అంతా భావించారు. న‌య‌న‌తార కూడా అలాగే అనుకుంది కానీ సినిమాలో ఆమె పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో కొంత నిరాష‌కు గురైంద‌ట‌. తాజాగా ర‌జ‌నీతో క‌లిసి మూడ‌వ సినిమా చేయ‌బోతోంది.

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ర‌జ‌నీ న‌టిస్తున్న 168వ చిత్ర‌మిది. ఇందులో న‌య‌న‌తార పాత్ర‌కు ప్రాధాన్య‌త వుంటుంద‌ని, ఆమె ఇందులో లాయ‌ర్‌గా ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని కోలీవుడ్ స‌మాచారం. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ కూడా ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

ర‌జ‌నీ ఇంట్ర‌డ‌క్ష‌న్‌కు సంబంధించిన పాట‌ని ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం పాడ‌టా డి. ఇమాన్ సంగీత నేతృత్వంలో రికార్డు చేశారు. గ్రామీణ నేప‌థ్యంలో `ముత్తు` త‌ర‌హాలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని, ర‌జ‌నీ పాత్ర చిత్ర‌ణ చాలా కొత్త‌గా వుంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతుతున్నాయి.