నయనతారను సైడ్ చేస్తున్నారుగా


నయనతారను సైడ్ చేస్తున్నారుగా
నయనతారను సైడ్ చేస్తున్నారుగా

ఈ కాలంలో సినిమాకు ప్రమోషన్స్ అనేవి అత్యంత కీలకమైనది. ఇదివరకు అంటే సినిమాకు ప్రమోషన్స్ లేకపోయినా నడిచిపోయేది. అసలు ఇంతలా ప్రమోట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రమోషన్స్ కచ్చితంగా చేయాలి. ఎంతటి టాప్ స్టార్ సినిమాకైనా ప్రమోషన్స్ లేకపోతే పనవ్వట్లేదు. అందుకే స్టార్ హీరోలు కూడా ఒక మెట్టు దిగి అటు డిజిటల్ మీడియాలో ఇటు ఆఫ్ లైన్ లో కూడా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియాకు ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో ప్రశ్నలు అడగమనడం, ఇలా ఏదొక రకంగా సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సినిమాను ఓన్ చేసుకుని ప్రమోషన్స్ ఇస్తున్నారు. కానీ నయనతార మాత్రం మొదటినుండీ ఒకే పద్దతిలో వెళుతోంది. సినిమాకు సంతకం పెట్టేముందే తాను ప్రమోషన్స్ కు హాజరవ్వనని తేల్చిచెప్పేస్తోంది. ఇష్టముంటేనే నన్ను తీసుకోండి లేకుంటే లేదు అని ఖరాఖండీగా చెప్పేస్తోంది. ఇలా ముందే చెప్పేయడం ఒకందుకు మంచిదే అయినా సినిమాను ప్రమోట్ చేయను అని కాలం మారుతున్నా భీష్మించుకుని కూర్చుంటే ఎలా అంటూ నిర్మాతలు వాపోతున్నారు.

ఒక సినిమాకు నయనతార అయితే పెర్ఫెక్ట్ అన్న ఉద్దేశంలో ఉంటారు. కానీ తీసుకోవాలో వద్దో అన్న సంశయం. ఎందుకంటే అది ఎంత స్పెషల్ చిత్రమైనా కూడా నయన్ ప్రమోషన్స్ కోసం ముందుకురాదు. ఎంత అడిగినా ఆ క్లాజ్ మాత్రం సడలించట్లేదు. దీంతో నయన్ ను తీసుకోవాలన్న ఆసక్తి నిర్మాతల్లో సన్నగిల్లుతోంది. ఈ మధ్య చిరంజీవి కూడా సైరా ప్రమోషన్స్ విషయంలో తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. మరో హీరోయిన్ లా కాకుండా తమన్నా ప్రమోషన్స్ కు రావడం సంతోషం అని ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేసాడు. మరి ఎందుకని నయన్ ప్రమోషన్స్ విషయంలో మంకుపట్టు పడుతోంది అన్నది అర్ధం కావడం లేదు. స్వతహాగా మంచి పెర్ఫార్మర్ అయిన నయన్ ప్రమోషన్స్ కు వచ్చిందంటే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. పైగా సీనియర్ల పక్కన సరిగ్గా సెట్ అవుతుంది నయన్.