బాహుబలి ప్రాజెక్ట్ లో నయనతార నటించనుందా?

బాహుబలి ప్రాజెక్ట్ లో నయనతార నటించనుందా?
బాహుబలి ప్రాజెక్ట్ లో నయనతార నటించనుందా?

బాహుబలి సిరీస్ రెండు సినిమాలుగా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇండియన్ సినిమానే కాక వరల్డ్ సినిమాను కూడా తనవైపుకు తిప్పుకుంది ఈ చిత్రం. బాహుబలి ప్రీక్వెల్ గా బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ ను మొదలుపెట్టింది ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్.

ఈ వెబ్ సిరీస్ పనులు మొదలై తర్వాత స్క్రాప్ అయిపోయింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ కంటెంట్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో మళ్ళీ కొత్తగా ప్రాజెక్ట్ విషయంలో వర్కౌట్ చేస్తోంది.

బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ లో శివగామి పాత్రపై మెయిన్ ఫోకస్ ఉంటుంది. వామిక గబ్బి శివగామి రోల్ లో కనిపించనుంది. బిఫోర్ ది బిగినింగ్ లో నయనతార కూడా నటించనుందని సమాచారం. నయనతార పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సిరీస్ తోనే నయనతార డిజిటల్ డెబ్యూ చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుస్తాయి.