న‌య‌న‌తార – విఘ్నేష్‌ శివ‌న్‌ల‌కు క‌రోనా?


న‌య‌న‌తార - విఘ్నేష్‌ శివ‌న్‌ల‌కు క‌రోనా?
న‌య‌న‌తార – విఘ్నేష్‌ శివ‌న్‌ల‌కు క‌రోనా?

దేశ వ్యాప్తంగా క‌రోనా విళ‌య‌తాంవ‌డం సృష్టిస్తోంది. చిన్నా పెద్దా, ఉన్నోడూ, లేనోడూ అన్న తేడా లేకుండా అంద‌రినీ వ‌ణికిస్తోంది. తాజాగా రాజ‌కీయ‌ నాయ‌కుల‌తో పాటు ఫిల్మ్ సెల‌బ్రిటీల‌నీ వ‌ద‌ల‌డం లేదంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ల‌కు క‌రోనా పాజిటివ్ సోకింద‌ని, గ‌త కొన్ని రోజులుగా ఇద్ద‌రూ క‌రోనాతో బాధ‌ప‌డుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

దీంతో న‌య‌న‌తార అభిమానులు ఈ వార్త‌లు విని షాక్‌కు గుర‌వుతున్నారు. త్వ‌ర‌లో కోలుకోవాల‌ని అభిమానులు, నెటిజ‌న్స్ వ‌రుస ట్వీట్ లు చేస్తున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా న‌య‌న‌తార టీమ్ స్పందించింది. న‌య‌న‌తార – విఘ్నేష్‌ శివ‌న్‌ల‌కు క‌రోనా సోకిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, ఈ విష‌యంలో అభిమానులు ఎవ‌రూ ఆనందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

తాజాగా విగ్నేష్ శివ‌న్ కూడా స్పందించారు. తాము ఆరోగ్యంగానే వున్నామంటూ ఓ వీడియోని స‌ర‌దాగా షేర్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. న‌య‌న్‌, విగ్నేష్ చిన్న పిల్ల‌ల్లా మారిపోయి స‌ర‌దాగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫ‌న్నీ వీడియోని చూసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.