నయనతార రాహు పూజ చేస్తోందా?


నయనతార రాహు పూజ చేస్తోందా?
నయనతార రాహు పూజ చేస్తోందా?

నయనతార పెళ్లి వార్తలు గత కొన్నేళ్లుగా షికారు చేస్తూనే వున్నాయి. ఇక గత మూడేళ్ళుగా నయనతార పెళ్లి కి సంబందించిన వార్తలు మరీ ఎక్కువైంది. గత కొంత కాలంగా దర్శకుడు విగ్నేశ్ శివన్ తో డేటింగ్ లో వుంది. త్వరలోనే ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరికి పెళ్లయిందని ప్రచారం జరిగింది అయినా నయనతార స్పందించలేదు.

అయితే తాజా న్యూస్ ఏంటంటే నయనతార, విగ్నేష్ శివన్  వివాహం చేసుకోబోతున్నారని తెలిసింది. గత కొన్ని నెలల క్రితం టెంపుల్స్ ని దర్శించుకున్న నయన్ జంట పెళ్ళికి ముందు దోషాలు తొలగాలని రాహు పూజ చేయబోతున్నారట. తమిళనాడులోని తిరునాగేశ్వరం లోని రాహు టెంపుల్ లో శనిదోష నివారణ పూజ చేయబోతున్నట్టు తెలిసింది.
కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత నాయన్, విగ్నేష్ శివన్ ల వివాహం జరగనున్నట్టు తెలిసింది.