నాని మూవీ సెట్‌లోకి `రాజా రాణి` ఫేమ్‌!

నాని మూవీ సెట్‌లోకి `రాజా రాణి` ఫేమ్‌!
నాని మూవీ సెట్‌లోకి `రాజా రాణి` ఫేమ్‌!

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార, ఆర్య జంట‌గా న‌టించిన చిత్రం `రాజా రాణి`. అట్లీ కుమార్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయిన ఈ మూవీలో ఆర్య‌ ప్రేమించే యువ‌తిగా న‌టించి ఆక‌ట్టుకుంది మ‌ల‌యాళ న‌టి న‌జ్రియా న‌జిమ్‌. ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన న‌జ్రియా తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని మూవీతో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం `అంటే.. సుంద‌రానికి`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీగా నిర్మిస్తున్నా అడ‌ల్ట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. అంతే కాకుండా నాని న‌టిస్తున్న 28వ చిత్ర‌మిది. ఈ మూవీలో నానికి జోడీగా న‌జ్రియా న‌జీవ్ న‌టిస్తోంది. ఈ సోమ‌వారం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబ‌ద్‌లో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌జ్రియా న‌జీమ్‌.

ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఈ మూవీ త‌న‌కు చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేసింది. మైత్రీ మూవీమేక‌ర్స్ బృందం కూడా న‌జ్రియాకు వెల్క‌మ్ చెప్పేసింది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న న‌జ్రియాకు స్వాగం అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రీక‌ర‌ణ లో వున్న నాని త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)