రూలర్ టీజర్ లో పిచ్చేక్కించిన బాలయ్య బాబు


రూలర్ టీజర్ లో పిచ్చేక్కించిన బాలయ్య బాబు
రూలర్ టీజర్ లో పిచ్చేక్కించిన బాలయ్య బాబు

నందమూరి నటసింహం బాలకృష్ణ పరిస్థితి ప్రస్తుతం ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ మాదిరిగా ఉంది. ఈ సంవత్సరం తను ఎంతో అంచనాలు పెట్టుకొని, అదే విధంగా ఎంతో వ్యయప్రయాసలతో రూపొందించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండు ఘోర పరాజయం పాలవడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ కూడా అంతేస్థాయిలో ఘోరంగా పరాజయం పాలవడంతో, ఈ సంవత్సరం బాలకృష్ణకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. ఎప్పటిలాగే హిందూపురంలో మంచి మెజారిటీతో శాసనసభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ రాజకీయంగా కొంత సైలెంట్ గా ఉన్నా, వెంటనే, తన నుంచి వచ్చే సినిమాలు అభిమానులను భారీ స్థాయిలో అలరించాలని అందుకు అనుగుణంగా ప్రాజెక్టులు సిద్ధం చేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో అతి తక్కువ సమయంలో సినిమాలు తీయగలిగే తమిళ అగ్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తో ప్రస్తుతం బాలయ్య బాబు తన తాజా చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేశాడు. ఆ సినిమా పేరు రూలర్.

ఈ సినిమాలో అత్యంత శక్తివంతమైన పోలీసు అధికారి పాత్రలో బాలయ్య బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ మరియు వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. నమ్ముకున్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు నుండి కాపాడే ధర్మ అనే క్యారెక్టర్ లో బాలకృష్ణ ఇందులో కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర మొత్తం 3 వేరియేషన్స్ లో సాగుతుంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య తో పాటు ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ షాయాజీ షిండే,లాంటి పనులు అగ్ర నటీనటులు కనిపిస్తున్నారు. “ఒంటి పైన ఖాకీ చొక్కా ఉంటేనే, నేను బోనులో ఉన్న సింహం లాగా ఉంటా..! అదే నా ఒంటి మీద యూనిఫాం లేకపోతే నేను బయటకు వచ్చిన సింహం లాగా అస్సలు ఆగను..! ఇక వేటే.. అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు 13 కిలోల బరువు తగ్గి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం చివర్లో క్రిస్మస్ సీజన్ లో బాలయ్య బాబు ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడు సంక్రాంతి సీజన్ కి వచ్చే బాక్సాఫీస్ బాద్షా బాలకృష్ణ ప్రస్తుతం తన ట్రెండ్ మార్చి ఈ సారి క్రిస్మస్ సీజన్ కి వస్తున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బాలయ్య బాబు మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.