బాలయ్య “పడతాడు” అంటుంటే ఎవడూ పట్టించుకోడే..?


 

NBK Ruler Movie padathadu song released
NBK Ruler Movie padathadu song released

బాలయ్య బాబుకి ఫ్యాన్స్ పై కోపం వస్తే, క్రమశిక్షణ తప్పితే కొడతాడు అని తెలుసు కానీ, ఈ “పడతాడు” ఏంటండీ..?  ఆయన అప్పుడప్పుడూ పాటలు పాడతాడు అని అందరూ మిస్ అండర్ స్టాండ్ చేసుకోవద్దు. మేము నిజంగా పెట్టిన హెడ్ లైన్ కరెక్టే. రెండు రోజుల క్రితం నటసింహం లేటెస్ట్ మూవీ “రూలర్”  సినిమాలో ఒక పాట రిలీజ్ అయ్యింది. మీకు ఏమైనా తెలిసిందా.? అలాంటిలాంటి పాట కూడా కాదు.

మ్యూజిక్ ఇచ్చింది ఆల్రెడీ బాలయ్య బాబుతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ ఇచ్చిన చిరంతన్ భట్. పాట రాసింది మాస్ పాటలకు పెట్టింది పేరు అయిన భాస్కరభట్ల గారు. ఇంకా పాడింది బాలయ్య కి ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన సింహ గారు. పాట లో డాన్స్ చేసింది ఒకసారి ఫాన్స్ కి రిజిస్టర్ అయిన హిట్ పెయిర్ బాలక్రిష్ణ & సోనాల్ చౌహాన్. ఒక పక్క పొట్టి బట్టలతో తడి అందాలతో సోనాల్ పాప మెరుపులు; ఇంకో పక్క 60 ఏళ్ళు వచ్చినా కూడా, జానీ మాస్టర్ తోపాటు సమానంగా స్టెప్పులు వేస్తున్న బాలకృష్ణ విజువల్స్ ఉన్నా కూడా సాంగ్ కేవలం 6.5 లక్షలు మాత్రమె వ్యూస్ వెళ్ళింది.

పాటలో ఇన్ని హైలెట్స్ ఉన్నాయి, అమరి ఎందుకు రీచ్ లేదు.? ఇంకొక అమ్ముకుట్టి లెవల్ వెళ్ళే సాంగ్ ని సరిగ్గా P.R టీం ప్రమోషన్ చెయ్యలేదు అని అబిమానులు ఫైర్ అవుతున్నారు. ఎంతైనా గత కొన్ని సినిమాలుగా, బాలకృష్ణ సినిమాలను సరిగ్గా పబ్లిసిటీ ప్లాన్ చెయ్యడం లేదు. పైసా వసూల్ తరువాత, బాలయ్య బాబు ఏ సినిమాకు అంత బాగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఆయన ఒకవైపు ఎమ్యెల్యేగా , మరోవైపు బసవతారకం ఆసుపత్రి వ్యవహరాలు చూసుకుంటున్నారు . మరి ఇప్పటికైనా సదరు సినిమా టీం ఆయన కష్టం గ్రహించి సినిమాను ప్రమోట్ చేస్తారేమో చూడాలి.