దీపిక మేనేజ‌ర్ ఎందుకీలా చేసింది?


దీపిక మేనేజ‌ర్ ఎందుకీలా చేసింది?
దీపిక మేనేజ‌ర్ ఎందుకీలా చేసింది?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మ‌లుపులు తిరుగుతూ డ్ర‌గ్స్ ద‌గ్గ‌ర ఆగిపోయింది. దీంతో బాలీవుడ్ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతోంది. నార్కోటిక్స్ డ్ర‌గ్ కంట్రోల్ బోర్ట్ అధికారులు సుశాంత్ మృతికి డ్ర‌గ్స్ కి సంబంధం వుంద‌న్న కోణంలో ద‌ర్యాప్తుని ముమ్మ‌రం చేయ‌డంతో రియాకు డ్ర‌గ్ పెడ్ల‌ర్‌ల‌తో సంబంధాలున్న‌ట్టు కీల‌క ఆధారాలు ల‌భించాయ‌ట‌. దీంతో ఆమెని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ‌ని వేగ‌వంతం చేశారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు హీరోయిన్‌ల పేర్లు జాతీయ మీడియాలో ప‌తాక శిర్ష‌క‌లో నిలిచాయి.

తాజాగా దీపికా ప‌దుకోనే మేనేజ‌ర్ క‌రిష్మ ప్ర‌కాష్‌కు కూడా లింక్ డ్ర‌గ్స్‌తో లింక్ వున్న‌ట్టు అనుమానిస్తూ ఎన్‌సీబీ అధికారులు సోమ‌వారం ఆమెకు స‌మ‌న్లు జారీ చేసిన‌ట్టు జాతీయ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అయింది. అయితే ఎన్‌సీబీ అధికారులు ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం ముంబైలోని ఎన్‌సీబీ కార్యాల‌యంలో క‌రిష్మ ప్ర‌కాష్ హాజ‌రు కావాల్సి వుంద‌ట‌. కానీ ఆమె హాజ‌రు కాక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. దీపిక మేనేజ‌ర్ ఎందుకిలా చేసింద‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం న‌డుస్తోంది.

ఆమెకు మ‌రోసారి ఎన్‌సీబీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసే అవ‌కాశం వుంద‌ని ఆ త‌రువాత కూడా ఆమె నుంచి ఎలాంటి స్పంద‌న రాకుంటే అధికారులు యాక్ష‌న్ తీసుకుంటార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో దీపిక న‌టిస్తున్నార‌ట‌. దీని షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. ఆ కార‌ణంగానే దీపిక మేనేజ‌ర్ క‌రిష్మ ఎన్‌సీబీ అధికారుల ముందు హాజ‌రు కాలేద‌ని అంటున్నారు.