ఆ న‌లుగురికి ఎన్సీబీ స‌మ‌న్లు.. కంగ‌న ట్వీట్‌!


ఆ న‌లుగురికి ఎన్సీబీ స‌మ‌న్లు.. కంగ‌న ట్వీట్‌!
ఆ న‌లుగురికి ఎన్సీబీ స‌మ‌న్లు.. కంగ‌న ట్వీట్‌!

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వివాదం రోజు రోజుకీ తీగ లాగితే డొంక క‌దిలిన చందంగా మారిపోతోంది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రియా అరెస్ట్ కావ‌డంతో కీల‌క న‌టీన‌టుల పేర్ల‌న్నీ బ‌య‌టికి వ‌చ్చేస్తున్నాయి. డ్ర‌గ్స్ వివాదం కార‌ణంగా బాలీవుడ్‌లో జ‌రుగుతున్న చీక‌టి దందా బ‌య‌టికి వ‌చ్చే స్తోంది. తాజాగా ఈ వివాదంలో దీపిక ప‌దుకునే, సారా అలీఖాన్, ర‌కుల్, శ్ర‌ద్ధా కపూర్‌ల‌కు ఎన్సీబీ అధికారులు స‌మన్లు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇందులో న‌లుగురికి ఎన్సీబీ అధికారులు స్వ‌యంగా ఇంటికి వెళ్లి స‌మ‌న్లు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ల ఇంటికి వెళ్లిన ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు అంద‌జేయడం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఇద్ద‌రు ఎన్సీబీ అధికారుల ముందు ఈ నెల 26న విచార‌ణ‌కు హాజ‌రు కానున్నార‌ట‌. దీపిక గోవాలో వుండ‌టంతో ఆమె మేనేజ‌ర్ ద్వారా విషయాన్ని చేర‌వేసిన ఎస్సీబీ అధికారుల ముందు ఈ నెల 25న దీపిక హాజ‌రు కానుంద‌ట‌.

ఇక టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ కి కూడా స‌మ‌న్లు అందాయి. ఈ నెల 24న ర‌కుల్ ఎన్సీబీ అధికారుల ముందు హాజ‌రు కానుంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ కంగ‌న ఘాటుగా స్పందించింది. సుశాంత్ ని ఎవ‌రూ హ‌త్య చేయ‌లేద‌ని, కంగ‌నకు అన్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావించే బాలీవుడ్ మాఫియా తొలిసారి ప‌శ్చాతానికి సిద్ధంమై త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారేమో అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.