డ్ర‌గ్స్ కేసులో ముగ్గురు హీరోల‌కు స‌మ‌న్లు త‌ప్ప‌వా?

డ్ర‌గ్స్ కేసులో ముగ్గురు హీరోల‌కు స‌మ‌న్లు త‌ప్ప‌వా?
డ్ర‌గ్స్ కేసులో ముగ్గురు హీరోల‌కు స‌మ‌న్లు త‌ప్ప‌వా?

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో త‌న విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది.  సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణంగా డ్ర‌గ్స్ కేసు బ‌య‌ట‌ప‌డింది. డ్ర‌గ్స్‌కి , సుశాంత్ మృతికి సంబంధం ఏంట‌నే కోణంలో ఎన్సీబీ అధికారులు విచార‌ణ చేయ‌డం మొద‌లుపెట్టారు. రియా ఆమె సోదరుడు షోయిక్, శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్‌లను ‘డ్రగ్స్’ సేకరించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆ త‌రువాత కొంత మంది సెల‌బ్రిటీల పేర్లు తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

దీపికా ప‌దుకునే, ర‌కుల్‌, సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌ల పేర్లు బ‌య‌టికి రావ‌డం, వారికి ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేయ‌డం తెలిసిందే. వీరిని ఇటీవ‌లే ఎన్సీబీ అధికారులు విచారించారు. ఇక టాలెంట్ మేనేజర్ జయ సాహాను విచారించడం ఆమె వాట్సాప్ చాట్స్ లో కీల‌క వియాలు బ‌య‌టికి రావ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.  మేనేజర్ కరిష్మా ప్రకాష్‌తో దీపికా చేసిన చాట్‌లు కూడా బ‌య‌టికి వ‌చ్చేశాయి. ఇదిలా వుంటే బాలీవుడ్‌లో మ‌రో ముగ్గురు స్టార్ హీరోల‌కు ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేయ‌బోతోంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఎస్‌, ఆర్‌, ఎ అనే అక్ష‌రాల‌తో పేర్లు మొద‌ల‌య్యే బిగ్ స్టార్స్ కు కూడా డ్ర‌గ్స్‌కు సంబంధం వుంద‌ని చెబుతున్నారు. ఈ ముగ్గురు స్టార్స్ దీపిక‌తో క‌లిసి న‌టించిన‌వారేన‌ట‌. త్వ‌ర‌లోనే వీరికి ఎన్సీబీ స‌మ‌న్లు అంద‌జేయ‌బోతోంద‌ని ముంబై మీడియా టాక్‌. వీరి పేర్ల‌కు సంబంధించిర కీల‌క స‌మాచారం. ఇటీవ‌ల‌ అరెస్ట్ అయిన‌ నిర్మాత క్షిజిత్‌ ప్రసాద్ ఈ మూడు పేర్లను దర్యాప్తులో ఎన్‌సిబికి వెల్లడించార‌ట‌. దీంతో ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.