బాలీవుడ్ స్టార్ హీరోని కలిసిన సందీప్ వంగ



Sandeep Reddy Vanga
బాలీవుడ్ స్టార్ హీరోని కలిసిన సందీప్ వంగ

మొత్తానికి సస్పెన్స్ క్లియర్ అయిపోయింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తర్వాతి సినిమా ఎవరితోనో ఇంకా తేలలేదు కానీ ఎవరితో అన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. గతంలో మహేష్ తో సందీప్ సినిమా అన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అలాంటివేం లేవు. సందీప్ తర్వాతి సినిమా కూడా బాలీవుడ్ లోనే ఉండనుంది.

నిర్మాతలు కూడా కబీర్ సింగ్ ను తెరకెక్కించిన వారే. హీరోగా రణబీర్ కపూర్ ను అనుకుంటున్నాడు సందీప్ వంగ. రీసెంట్ గా ఈ బాలీవుడ్ స్టార్ హీరోను కలిసి కథ కూడా చెప్పాడట. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథకు రణబీర్ ఫ్లాట్ అయిపోయాడు కానీ ప్రస్తుతం అతని చేతిలో మూడు చిత్రాల కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయితే కానీ ఇది మొదలుపెట్టలేడు. ఇది మొదలుపెట్టాలంటే ఎంత లేదన్నా సంవత్సరం టైమ్ పడుతుంది. మరి అంతవరకూ సందీప్ ఆగుతాడా అన్నదే తేలాల్సి ఉంది.