ప్రదీప్ కోసం మాట నిలబెట్టుకున్న మహేష్


Neeli Neeli Aakasam Full Video Song From 30 Rojullo Preminchadam Ela Movie
Neeli Neeli Aakasam Full Video Song From 30 Rojullo Preminchadam Ela Movie

బుల్లితెరపై “గడసరి అత్త – సొగసరి కోడలు” అనే ప్రోగ్రాం తో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బుల్లితెర యాంకర్ మరియు నటుడు ప్రదీప్ మాచిరాజు తర్వాత స్వంతంగా టెలివిజన్ షోలు చేసి అందులో రాణించారు. అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా మంచి పాత్రలు వేసి సినిమా ప్రేక్షకుల దృష్టిలో కూడా నిలిచారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి నటుడిగా వెండి తెర పై “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

ఎస్పీ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి “నీలి.. నీలి.. ఆకాశం అని సాగే ఒక మంచి లవ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. గతంలో ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో” కు అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రదీప్ సినిమా చేసినట్లయితే తన వంతు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారంగా, ప్రస్తుతం ఈ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా ఫిమేల్ లిరిక్స్ ను సీనియర్ గాయని సునీత ఆలపించారు. ఈ పాటకు సంబంధించిన సన్నివేశాలు కూడా జోడించారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల జంట మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు ఒకరికొకరు వారు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు.? అనే విషయాన్ని కూడా ఇందులో చూపించారు.

ఇక అమాయకమైన పల్లెటూరి పేద కుర్రాడిగా ప్రదీప్ మాచిరాజు ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పుడు కొత్తగా హీరో అనుకున్న వాళ్లు లవ్ స్టోరీస్ లేదంటే కమర్షియల్ సినిమాలు చేస్తూ, తమలో ఉన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటే.. తనలోని నటుడిని ఆవిష్కరించుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఇలాంటి ఒక కథ చేయటం నిజంగా ప్రదీప్ గట్స్ కి నిదర్శనం.