సీతారామ‌రాజుకు స్టార్ బాక్స‌ర్ పాఠాలు!సీతారామ‌రాజుకు స్టార్ బాక్స‌ర్ పాఠాలు!
సీతారామ‌రాజుకు స్టార్ బాక్స‌ర్ పాఠాలు!

సీతారామ‌రాజుకు స్టార్ బాక్స‌ర్ పాఠాలు నేర్పుతున్నారు. య‌స్ ఈ విష‌యాన్ని స్టార్ బాక్స‌ర్ నీర‌జ్ గోయ‌త్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఫొటోని షేర్ చేసి ఈ విష‌యాన్ని వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రామ్‌చ‌ర‌ణ్ ఇందులో ఓ సీన్‌లో పోలీస్‌గానూ, ఓ సీన్‌లో బాక్స‌ర్‌గానూ క‌నిపించ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసి ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌లోనే రివీల్ అయింది. ఈ సినిమాలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇందు కోసం భార‌తీయ స్టార్ బాక్స‌ర్ నీర‌జ్ గోయ‌త్‌ హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు బాక్సింగ్ పాఠాలు నేర్పుతున్నార‌ట‌. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం  చేసుకోవ‌డం కోసం రామ్‌చ‌ర‌ణ్ బాక్సింగ్ పాఠాలు నేర్చుకుంటున్నారు.

ఫాంట‌సీ క‌థ‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌పై ఓ బాక్సింగ్ సీన్‌ని క్రియేట్ చేశార‌ట జ‌క్క‌న్న‌. ఆ సీన్ కోసం రామ్‌చ‌ర‌ణ్‌కు స్టార్ బాక్స‌ర్ నీర‌జ్ గోయ‌త్ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నారు. కీర‌వాణి సంగీతం ఇందిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆ డేట్ మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.