హాలీవుడ్ కెళ్తున్న వరెస్ట్ యాక్ట్రెస్


వరెస్ట్ డే చిత్రంతో హాలీవుడ్ లో అడుగుపెడుతోంది డర్టీ భామ నీతూ చంద్ర . తెలుగులో గోదావరి , సత్యమేవ జయతే చిత్రాలలో నటించిన హాట్ భామ నీతూ చంద్ర . సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన పేరు కంటే అందాల ఆరబోత చేస్తూ చేసిన ఫోటో షూట్ ద్వారానే ఎక్కువ పేరు సంపాదించుకుంది నీతూ చంద్ర . అయితే ఈ భామ ఇన్నాళ్లకు హాలీవుడ్ లో ”వరెస్ట్ డే ” అనే షార్ట్ ఫిలిం లో నటిస్తోంది .

ఇందులో విలన్ గా నటిస్తోంది నీతూ చంద్ర . నెగెటివ్ క్యారెక్టర్ కావడంతో తప్పకుండా ఎక్కువ పేరు వస్తుంది అన్న ధీమాతో ఉంది . ఇక్కడ ఎలాగూ ఆశించిన స్థానం దక్కలేదు ఈ భామకు మరి అక్కడైనా నెగెటివ్ క్యారెక్టర్ తో మరింత హాట్ ఇమేజ్ వస్తుందేమో చూడాలి . 2019 ప్రారంభం అదిరింది , హాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాను అలాగే కొరియన్ సినిమాలో కూడా నటిస్తున్నాను అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది నీతూ చంద్ర .