తెరవెనుక జరిగింది మీకోసం


Neethu Chandra
తెరవెనుక జరిగింది మీకోసం

“శేఖర్ కమ్ముల” గారి దర్శకత్వంలో వచ్చిన “గోదావరి” సినిమాలో నటించిన “రాజి” పాత్ర గుర్తుంటే “నీతూ చంద్ర” గారిని కూడా మనం మరచిపోలేము. తెలుగులో అంత స్టార్ డం లేని నాకు హీరోయిన్ తో సమానమైన రోల్ శేఖర్ కమ్ముల గారు నాకు రాయడం .. అలాంటి పాత్ర నాకు ఇవ్వడం ఇంకా గుర్తుంది అని చాలా సార్లు, చాలా ఇంటర్వూస్ లో చెప్పింది.

తెలుగులో దాదాపు అడపాదపా సినిమాలు చేసింది.. హిట్లు కంటే ఫ్లాప్ లే ఎక్కువ వరించాయి. అలా అని ఊరుకోకుండా తన ప్రయత్నం తాను చేసేది… డబ్బింగ్ సినిమాల ద్వారా మనలని అలా అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉండేది. అందులో తెలుగు “13 బి” సినిమాలో చేసిన రోల్ తనకి బాగా గుర్తింపు తెచ్చింది. అక్కినేని “మనం” సినిమాలో కూడా చిన్న రోల్ చేసింది.

మొత్తంగా ఈ మధ్య తెలుగుకి దూరం అయ్యి.. తమిళ, బాలీవుడ్ లో చిన్న మూవీస్ లో ఐటెం సాంగ్స్ మరియు కీ రోల్స్, కవర్ సాంగ్స్ చేస్తుంది. అలా తాను చేసిన ఒక కవర్ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యింది. అది చేసినప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తన ఇంస్టాగ్రామ్ లో తెరవెనుక దాని గురించి మీకోసం అని పోస్ట్ చేసింది.

‘హుయ్ మే తుమ్హారీ’ అంటూ సాగే ఆ పాటని పాడింది ‘రేఖ భరద్వాజ్’, స్వర పరిచింది ‘అనుపమ్ రాజ్’. దర్శకుడు ‘ర్యాన్ హట్టవే’.. మరి తాను ఇకనైనా తెలుగు, తమిళ, బాలీవుడ్ లో బిజీ అవ్వాలి మంచి మంచి పాత్రలు ఆమెకి దక్కాలి అని వేడుకుందాం.

 

Credit: Instagram