వినయ విధేయ రామ చిత్రంపై నెగెటివ్ ప్రచారం


Negative talk on Ramcharan's Vinaya Vidheya Rama
Kiara Advani and Ram Charan

రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంపై నెగెటివ్ ప్రచారం పెద్ద రేంజ్ లోనే చేస్తున్నారు నెగెటివ్ ఫ్యాన్స్ . వినయ విధేయ రామ చిత్రం పెద్దగా లేదని , సంక్రాంతి సెలవులు కాబట్టి ఫరవాలేదు కానీ మరో సమయంలో వస్తే ప్లాప్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు . ఆకట్టుకునే కథ , కథనం లేవని కాకపోతే మెగా ఫ్యాన్స్ ని అలరించేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు .

అయితే నెగెటివ్ ప్రచారం ఎలా ఉన్నప్పటికీ వినయ విధేయ రామ మొదటి వారం వసూళ్లలో కుమ్మేయడం ఖాయం ఎందుకంటే మాస్ సినిమా అందునా సంక్రాంతి బరిలో దిగుతున్న సినిమా కావడంతో మొదటి రోజు , మొదటి వారం వసూళ్ల లో చరణ్ సినిమానే అగ్రస్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది . చరణ్ సరసన కియారా అద్వానీ నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు అన్న విషయం తెలిసిందే . జనవరి 11న వినయ విధేయ రామ భారీ ఎత్తున విడుదల అవుతోంది .

English Title: Negative talk on  Ramcharan’s Vinaya Vidheya Rama