టాక్సీ వాలా ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు


Negative talk spreads on vijay devarakonda's TAXIWALA

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఫ్లాప్ అంటూ కొంతమంది అదేపనిగా ప్రచారం చేస్తున్నారు . ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలుసా ……… టాక్సీ వాలా చిత్రం ఇంతకుముందు మొత్తం లీకైన సంగతి తెలిసిందే . గీత గోవిందం చిత్రంతో పాటుగా టాక్సీ వాలా చిత్రం కూడా మొత్తం లీక్ అయ్యింది అయితే అది రఫ్ ఎడిషన్ కావడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు . సినిమా మొత్తం లీక్ కావడంతో ఆ సినిమాని చూసిన వాళ్ళు టాక్సీ వాలా చిత్రం బాగోలేదని అంటున్నారు . అంతేకాదు టాక్సీ వాలా సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు . ఆ టాక్ ఇప్పుడు టాలీవుడ్ ని ఊపేస్తోంది .

రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ చూసి ఈ సినిమా ఇలాగే విడుదల చేస్తే ఫ్లాప్ అవుతుందని చెప్పి సినిమా విడుదల వాయిదా వేయించాడు . ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు నవంబర్ లో విడుదల చేయిస్తున్నారు . నవంబర్ 16 న టాక్సీ వాలా చిత్రం విడుదల కానుంది . విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం గత నెలలో విడుదలై ఘోర పరాజయం పొందింది . ఇక ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ అయితే దారుణమే !

English Title: Negative talk spreads on vijay devarakonda’s TAXIWALA