తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా `నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్‌!!


NENE KEDI NO.1 Movie Trailer launch matter
NENE KEDI NO.1 Movie Trailer launch matter

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం `నేనే కేడీ నెం-1’. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైల‌ర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా `నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ట్రైల‌ర్ రిలీజ్ చేసిన అనంత‌రం సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ…“ట్రైల‌ర్ చాలా బావుంది. ఓ చ‌క్క‌టి క‌థాంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసేలా సినిమా తీసిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ష‌క‌ల‌క శంక‌ర్ కి మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. చిన్న సినిమాలు ఆడితేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ప‌ది మందికి ప‌ని దొరుకుతుంది. ఈ మ‌ధ్య కాలంలో మంచి కంటెంట్ తో వ‌చ్చిన చిన్న చిత్రాలు బాగా ఆడుతూ, మంచి వ‌సూళ్లు సాధిస్తూ పెద్ద సినిమాల స‌ర‌స‌న చేరుతున్నాయి. చిన్న చిత్రాల నిర్మాత‌ల‌కు నేను చెప్పేది ఒక‌టే… మంచి కంటెంట్ తో సినిమా తీయండి, అది కూడా బ‌డ్జెట్ పెర‌గ‌కుండా చూసుకోండి. చిన్న చిత్రాల నిర్మాత‌ల కోసం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఒక తుది నిర్ణ‌యానికొస్తాం. ఇక ఎంత మంచి సినిమా తీసినా మీడియానే జ‌నాల్లోకి తీసుకెళ్లేది కాబట్టి, చిన్న సినిమాలకు మంచి ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని కోరుకుంటూ `నేనే కేడీ నెం-1` సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి జానీ కి మంచి పేరు, మంచి లాభాలు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ…“ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు చేసాను కానీ, ఈ సినిమాతో మంచి పేరొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మా ద‌ర్శ‌క నిర్మాత సాంగ్స్ విష‌యంలో ఎంతో కేర్ తీసుకున్నారు. ష‌క‌ల‌క శంక‌ర్ గారు ఎంతో స‌పోర్ట్ చేసారు“ అన్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ…‘‘ మంచి ఎంట‌ర్‌టైన్ తో వ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `నేనే కేడి నెం-1`. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి వ‌దిలేస్తున్నారు. ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. త‌ప్ప‌కుండా ప్రతి త‌ల్లిదండ్రీ తో పాటు పిల్ల‌లు చూడాల్సిన సినిమా ఇది. ష‌క‌ల‌క శంక‌ర్ క్యార‌క్ట‌ర్ ఇందులో త్రీ పేడ్స్ తో ఉంటుంది. ఆడియ‌న్స్ కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించాం. హీరోయిన్ ముస్కాన్ అందం, అభిన‌యం అలాగే `నికిషా ప‌టేల్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. ఈ సినిమాను ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మా సినిమా రిలీజ్ విష‌యంలో ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తోన్న న‌డిమింటి స‌త్య‌నారాయ‌ణ గారికి ప్ర‌త్యే ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ముకుల్ దేవ్‌, నికిషా ప‌టేల్ , క‌రాటే క‌ళ్యాణి, దేవ‌న్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః శ్రావ‌ణ్ కుమార్; ఎడిట‌ర్ః సాములేటి శ్రీనివాస్ ; స్టోరీ – స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాతః జాని