“నేను c/o నువ్వు” మూవీ ట్రైల‌ర్ లాంచ్‌


Nenu CO Nuvvu Movie Trailer Launch

అగాపే అకాడ‌మీ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న చిత్రం “నేను c/o నువ్వు.” సాగారెడ్డి తుమ్మా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కిషోర్‌, సానియా సిన్యా, బాషా త‌దితరులు న‌టిస్తున్నారు. 1980వ ద‌శాబ్ద‌పు య‌దార్ధ ప్రేమ‌క‌థ ఆధారంగా తీసిన చిత్ర‌మిది. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో విడుద‌ల అయింది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో…

సాగారెడ్డి మాట్లాడుతూ…రెండు సంవ‌త్స‌రాల నుంచి ఈ చిత్రం న‌డుస్తుంది. ఇది కేవ‌లం నా ఒక్క‌డి చిత్రం కాదు నా ఫ్రెండ్స్‌, పార్ట‌న‌ర్స్ కూడా ఉన్నారు. మ‌న జీవితంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల్లో మ‌నం రియాక్ట్ అవుతాం కొన్ని రియ‌లైజ్ అవుతాం. ఈ చిత్రం కోసం నా డైరెక్ట‌ర్ టీమ్ మొత్తం చాలా హెల్ప్ చేసింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ర‌ఘునాధ్‌ గారిని ఈ చిత్రం ద్వారా తెలుగు లో నేను ప‌రిచ‌యం చేశాను. ఈ సినిమా గురించి నేను ఎక్కువ‌గా మాట్లాడకూడ‌దు. ఏది మాట్లాడినా కాంట్ర‌వ‌ర్సీ అనుకుంటారు. కాబ‌ట్టి. ఎందుకంటే ఇందులోని డైలాగ్స్ అన్నిచాలా బోల్డ్‌గా ఉంటాయి. ద‌య‌చేసి ఈ చిత్రంలోని డైలాగ్స్‌ని ఎవ‌రూ ప‌ర్స‌న‌ల్‌గా తీసుకోవ‌ద్దు. నేను రెడ్డిని కాబ‌ట్టి ఆ క్యాస్ట్‌ని వెన‌కేసుకొచ్చాను అని అనుకోవ‌ద్దు. అంద‌రూ ఈ చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

స‌హ‌నిర్మాత‌లు మాట్లాడుతూ… ఈ చిత్రం తియ్య‌డానికి సాగారెడ్డి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మాకు కంటెంట్ బాగా న‌చ్చి ఈ చిత్రం చెయ్య‌డానికి ఒప్పుకున్నాం త‌ప్ప‌కుండా ఈ చిత్రం స‌క్సెస్ సాధిస్తుంద‌ని మీరంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను మీకు నా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

న‌టీన‌టులుః కిషోర్‌, సానియాసిన్యా, బాషా, ర‌వింద‌ర్‌, విన‌య్‌, రాధాకృష్ణ‌, ధ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులుః కెమెరామెన్ జి.కృష్ణ‌ప్ర‌సాద్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్‌పుడి, (ఆర్ట్‌) పి.ఎస్‌.వ‌ర్మ‌, లిరిక్స్ఃప్ర‌ణవం, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంఃసాగారెడ్డి, స‌హ‌నిర్మాత‌లుఃఎం.డి.అతుల్, త‌మ్మ‌దుర్గేష్‌రెడ్డి, కొండ శ‌శిరెడ్డి.