ఆ కామెడీ గాడికి చాల బిల్డ్ అప్ ఉంది, అది ఋజువైంది కుడా….


Nenu Naa Nagarjuna
ఆ కామెడీ గాడికి చాల బిల్డ్ అప్ ఉంది, అది ఋజువైంది కుడా….

“ఆ కామెడి గాడికి అంత బిల్డ్ అప్ ఇవ్వకు, వాడి బిల్డ్ అప్ వాడు ఇచ్చుకోగలడు, వాడి వెనకాల ఒక రంగస్థలం ఉందే”. ఇది సెప్టెంబర్ 20 వ తారీఖున విడుదలకి సిద్దంగా ఉన్న “నేను నా నాగార్జున” సినిమాలోని ఒక డైలాగు. మొదటి సారి హీరోగా తన అదృష్టాన్ని తెలుసుకోవాలి, జనాలు మంచి కథలు ఉంటే సినిమాలు చూస్తారు అని నమ్మి ముందుకి వెళ్తున్న మన “మహేష్ ఆచంట” కథ.

నిజానికి ఇతగాడు ఇప్పటివరకి బాగా అభివృద్ధి చెందాడు అని అతను చేసిన సినిమాల లోని పాత్రలు ఉదహరణ, పరిక్షలు రాసి విజయం అయిన విద్యార్ధుల కథ లాంటిది మన వాడి కష్టం, ఆ కష్టాన్ని అంత సింపుల్ గా తీసుకోలేని మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా. అయితే ఒక సాధారణమైన కామెడీ క్యారెక్టర్ నుండి హీరో గా, టాలీవుడ్ లో ఇదివరకి తమ వంతు ప్రయత్నాలు చేసారు కూడా. కాని మన మహేష్ గారిది అలాంటి పరిస్థితి కూడా కాదు ఇప్పటివరకి ఎంచుకున్న పాత్రలు బాగా సక్సెస్ అయ్యాయి అంటే, అది అతని నమ్మకం. సినిమా కథలు ఎంచుకోవడం లో గాని, పాత్రని అభివృద్ధి చేయడం లో కూడా సుప్రసిద్ధుడు అని ఇప్పటికి సగానికి పైగా అందరు మన వాడికి ఓట్లు వేసారు.

ఇంకా ఈ సినిమా దగ్గరికి ఒస్తే ట్రైలర్ చూడడానికి ఇది ఎదో కొంచెం విభిన్నంగా ఉందని అనిపిస్తుంది, అసలు నాగార్జున గారి గురించి ఎందుకు వచ్చిందో, అసలు కథ ఏంటో, మహేష్ గారు ఈ సారి జనాలని ఎలా అలరిస్తారో ఈ నెల-20 వ తారీఖున చూద్దాం.