హీరో విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విలన్

హీరో విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విలన్
హీరో విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విలన్

అలనాటి విలన్ నెపోలియన్ ఎన్నో మరపురాని పాత్రలు తన కెరీర్ లో పోషించాడు. ముఖ్యంగా తమిళ సినిమాల్లో నెపోలియన్ తనదైన మార్క్ ను చూపించాడు. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు. చక్కని శరీర ధారుడ్యం, గంభీరమైన గొంతు ఉండడంతో నెపోలియన్ విలన్ వేషాలకు సరిగ్గా సరిపోయాడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా విలన్ పాత్రల నుండి క్యారెక్టర్ రోల్స్ వైపు మారిపోయాడు.

రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ కోలీవుడ్ టాప్ హీరో విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇకపై విజయ్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేసాడు. పోకిరి షూటింగ్ సమయంలో ఇద్దరికీ జరిగిన వాగ్వాదామే దీనికి కారణమని తెలిపాడు నెపోలియన్. అందుకే విజయ్ తో నటించబోయేది లేదని తేల్చి చెప్పాడు.

అలాగే కోలీవుడ్ లో అందరి హీరోలతో నటించానని, ఒక్క అజిత్ తో మాత్రమే కలిసి పనిచేయలేదని, అవకాశం వస్తే కచ్చితంగా అజిత్ సినిమాలో పాత్రను పోషిస్తానని, అయితే విలన్ గా తన టైమ్ అయిపోయిందని, కాబట్టి క్యారెక్టర్ పాత్రలైతే తప్పకుండా పోషిస్తానని తెలిపాడు నెపోలియన్. మరి ఈ రెండు స్టేట్మెంట్స్ తో నెపోలియన్ ఉద్దేశమేమిటో మరి.