అలీ మ‌నిషిరూపంలో వున్న విష‌ స‌ర్పం?


అలీ మ‌నిషిరూపంలో వున్న విష‌ స‌ర్పం?
అలీ మ‌నిషిరూపంలో వున్న విష‌ స‌ర్పం?

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్ అలీది చెద‌ర‌ని స్థానం. ఎంత మంది క‌మెడియ‌న్‌లు వ‌చ్చినా అలీ స్థానం అలీదే. అంత‌గా ఇండ‌స్ట్రీలోని వాళ్ల‌తో క‌లిసిపోయారాయ‌న‌. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అలీకి మ‌ధ్య మంచి స్నేహ బంధం గ‌త కొన్నేళ్లుగా సాగుతోంది. అయితే అలీ ఇటీవ‌ల రాజ‌కీయాల్లోకి ఎంట‌రైన త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింద‌ని, మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే వున్నాయి. ఆ వార్త‌ల‌కు త‌గ్గ‌ట్టే న‌టుడు అలీ కూడా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లైంది.

ఆ మ‌ధ్య ప‌వ‌న్ నుంచి త‌న‌కు మామిడి ప‌ళ్లు రావ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అలీ వెల్ల‌డించ‌డంతో అలీని ప‌వ‌న్ కూడా ప‌క్క‌న పెట్టార‌ని అంతా అనుకున్నారు. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అలీ పెట్టిన పోస్ట్ ఓ అభిమానికి ఆగ్ర‌హాన్ని తెప్పించింది. `వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు..` అని అలీ ట్వీట్ చేశారు. దీనికి ఓ నెటిజ‌న్ పెట్టిన రిప్లై అలీకి షాకిస్తోంది.

`మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాని నికు ని కన్న తల్లి చనిపోతే కనీసం సానుభూతి తెలపని వాడి తో వుంటు పార్టీ కండువా కప్పి వాడి అవరాలకి వాడుకొని వదిలేసిన నిన్ను మళ్లీ నిన్ను మా పవన్ కళ్యాణ్ గారు ఎలా క్షమిస్తాడు మిస్టర్ అలీ` అంటూ ఓ నెటిజ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం వైర‌ల్‌గా మారింది. దీనిపై అలీ ఎలా స్పందిస్తారో చూడాలి.