రాఖీ సావంత్ పై మండిపడుతున్న నెటిజన్లు


హాట్ భామ రాఖీ సావంత్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు . రాఖీ పై ఇంతగా నెటిజన్లకు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. పాకిస్థాన్ జాతీయ జెండా ని తన ఒంటి పై కప్పుకోవడమే ! ఒంటిపై కప్పుకోవడమే కాదు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దాంతో నువ్ రాఖీ పాకిస్థాన్ సావంత్ వి అంటూ రాఖీ పై నిప్పులు చెరుగుతున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు .

ఈ విమర్శలు ఎక్కువ కావడంతో స్పందించిన రాఖీ వివరణ ఇచ్చుకుంది .” ధార 370 ” అనే చిత్రంలో పాకిస్థాన్ అమ్మాయిగా నటిస్తున్నాను అందుకే పాకిస్థాన్ జెండా కప్పుకొని నటించాను అది తప్పా ! అయినా కొంతమంది జిహాదీ అంటూ భారత్ పై విషం చిమ్ముతున్నారు అంతేకాని మొత్తం పాక్ జాతి కాదు అంటూ వాళ్లకు వత్తాసు పలుకుతోంది వివాదాస్పద భామ రాఖీ సావంత్ . రాఖీ అంటేనే వివాదం ఇక ఈ వివాదం గురించి కొత్తగా చెప్పేదేముంది .