ధోని , పూజా హెగ్డే లపై నెటిజన్ల ఫైర్


Pooja Hegde
Pooja Hegde

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని పై అలాగే అతడ్ని సమర్థిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు . నిన్న ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ తో ఆడిన విషయం తెలిసిందే . అందులో భారత్ ఓడిపోవడంతో వరల్డ్ కప్ నుండి నిష్కమించింది . అయితే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ధోని ని పొగుడుతూ ట్వీట్ చేయడంతో నెటిజన్లకు ఎక్కడ లేని కోపం వచ్చింది .

అసలు ధోని వల్లే ఇండియా మ్యాచ్ ఓడిపోయింది అంటూ ధోని మాత్రమే విమర్శించకుండా పూజా హెగ్డే ని కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు నెటిజన్లు . పూజా హెగ్డే కు ధోని అంటే అభిమానం ఆ అభిమానంతో ధోని ని ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది . నిన్నటి మ్యాచ్ లో ధోని చేసిన పనేంటి అంటే హాఫ్ సెంచరీ చేయడమే ! అంతేకాని భారత్ విజయం కోసం శ్రమించిన దాఖలాలు అయితే లేవు . వరల్డ్ కప్ లో విజయం మనదే అని అనుకుంటున్న భారతీయుల ఆశలు ఆవిరి కావడంతో ధోని పై ఇతర ఆటగాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు .