జబర్దస్త్ స్కిట్ పై నిప్పులు


Netizens fires on jabardasth mukku avinash

ముక్కు అవినాష్ చేసిన జగిత్యాల స్కిట్ పై కరీం నగర్ జిల్లా వాసులు , జగిత్యాల వాసులు నిప్పులు చెరుగుతున్నారు . అరేయ్ ! ముక్కు అవినాష్ మా బతుకులను అవమానిస్తావా ? అంటూ బూతుల వర్షం కురిపిస్తున్నారు . మా జీవితాల పట్ల అవహగానా రాహిత్యంతో స్కిట్ చేస్తావా ? మా మహిళలను కించపరిచేలా స్కిట్ చేస్తావా ? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం ముక్కు అవినాష్ స్కిట్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు . జగిత్యాల స్కిట్ పేరుతో చేసిన ఎపిసోడ్ జగిత్యాల మహిళలను కించపరిచేలా ఉంది దాంతో ఈ విమర్శలు వస్తున్నాయి .

బ్రతుకుదెరువు కోసం మగవాళ్ళు దుబాయ్ కి ఇతర దేశాలకు వెళితే వాళ్ళ భార్యలు ఇతర పురుషుల పట్ల వ్యామోహం చెందుతారని ముక్కు అవినాష్ స్కిట్ సారాంశం . ఇది తప్పకుండా ఆ మహిళలను , దుబాయ్ వెళ్ళిన మగవాళ్ళని కించపరచడమే అందుకే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ముక్కు అవినాష్ ని బండ బూతులు తిడుతున్నారు జనాలు . ఇంతకుముందు కూడా జబర్దస్త్ లో వచ్చిన పలు ఎపిసోడ్ లు పలు వివాదాలను సృష్టించాయి . ఒకదశలో నల్ల వేణు పై దాడి కూడా జరిగిన విషయం తెలిసిందే .

English Title: Netizens fires on jabardasth mukku avinash